సీఎం రేవంత్ ‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. పరువు నష్టం దావా కొట్టివేత!

ఠాగూర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (12:59 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ దాఖలుచేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను అపెక్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. రాజకీయపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
గత ఎన్నికల ప్రచర సమయంలో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేబీ శాఖ పరువు నష్టం దావా వేసింది. తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టుల దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబంధించిన వివదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ పరువు నష్టం దావా కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం