ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఠాగూర్
సోమవారం, 4 ఆగస్టు 2025 (10:17 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లలో వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేకంగా నిఘా ఉంచిన పోలీసులు.. పక్కా సమాచారంతో తనిఖీలు చేస్తూ పలు పార్టీలను అడ్డుకుంటున్నారు. తాజాగా శివారు ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో కొందరు ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్టు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌‍పై సోదాలు చేసి ఐదుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేశారు. 
 
నిందితుల నుంచి 0.5 గ్రాముల ఎన్.ఎస్.డి బ్లాట్స్, 20 గ్రాముల హ్యాష్ ఆయిల్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చేవెళ్ల ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర రెడ్డి మీడియాకు వెల్లడించారు. 
 
అరెస్టయిన ఐటీ ఉద్యోగుల్లో అభిజిత్ బెనర్జీ, సింప్సన్, పార్ధు, గోయల్, యశ్వంత్ రెడ్డి, సివియో డెన్నిస్‌లు ఉన్నారు. వీరంతా కలిసి శివారు ప్రాంతమైన మొయినాబాద్‌ మండలం మేడిపల్లిలోని సెరీస్ ఆర్చర్ట్స్ ఫామ్ హౌస్‌లో పార్టీ చేసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు ఆదివారం అర్థరాత్రి సోదాలు నిర్వహించి అరెస్టు చేశారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారంతా డ్రగ్స్ సేవించినట్టు తేలింది. దీంతో వారిని అరెస్టు చేయడంతో పాటు ఫామ్ హౌస్ నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments