తెలంగాణలో ఈగిల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే.. ఈ పబ్ యజమానులు డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే అనే ఈ ముగ్గురు యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది.
ఈ విషయం నిజమేనని పబ్ యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఒప్పుకోవడంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటులో ఇతర పబ్ యజమానుల పాత్ర ఏమైనా వుందా అనే కోణంలో ఈగల్ టీమ్ విచారణ జరుపుతున్నారు.