Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (21:47 IST)
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
 
ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సికింద్రాబాద్- హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ఈ రథయాత్ర నేపథ్యంలో పేర్కొన్న సమయాలను గమనించి, తదనుగుణంగా దర్శనం ప్లాన్ చేసుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.
 
ఈ నేపథ్యంలో దర్శనం కోసం ఆలయ ద్వారాలు ఉదయం 6:15 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ఆలయం నుండి ప్రారంభమై జనరల్ బజార్ నుండి కొనసాగి, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:00 వరకు ఎంజి రోడ్‌కి చేరుకుంటుంది. ఆ తర్వాత రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ నుండి వెళ్లి మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments