Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి అనే నేను... మరికొన్ని గంటల్లో తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (08:06 IST)
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్, మంత్రులతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 
 
నిజానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించినా.. తర్వాత ముహూర్త సమయాన్ని మార్చారు. పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 'ఆరు గ్యారంటీల' చట్టానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొద్ది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకంగా.. సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్ నాయకులు అందజేయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రొటోకాల్ ప్రకారం.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే సహా పలువురు ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. 
 
కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయపక్షాల నాయకులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ తదితరులున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సహా కొందరు వామపక్ష నాయకులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments