Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యో.. మేం వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందా? ప్రజలు మెసేజ్

Advertiesment
kcrao
, బుధవారం, 6 డిశెంబరు 2023 (19:59 IST)
ప్రభుత్వం పోవాలంటూ ఒకసారి ఓట్లు వేసాక.. అయ్యో మేం వేసిన ఓట్లు వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అని ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన జనం సందేశాలు పంపుతున్నారట. ఈ మాట తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
 
ప్రతి ఎన్నికలోనూ అనుకున్న ఫలితాలు రావనీ, ఒక్కోసారి మనం అనుకోనివి ఎదురవుతుంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినవారు తాము వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అంటూ తమకు సందేశాలను పంపుతున్నారని చెప్పారు. ఓటమి పాలైనంత మాత్రాన బాధపడేది ఏమీలేదనీ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం తాము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతామని చెప్పారు.
 
పార్టీ పరాజయం పాలైందని ఆవేదన చెందనక్కర్లేదని, తప్పకుండా మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధైర్యం చెప్పారు. మరోవైపు కేసీఆర్ బస చేసి వున్న ఫామ్ హౌసుకి చింతమడక ప్రజలు పెద్దఎత్తున వెళ్లి ఆయనను సందర్శించి జైకొట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్స్, గ్లోబల్ ఇన్‌సైట్‌లను ఆవిష్కరించనున్న IFSEC ఇండియా ఎక్స్‌పో 16వ ఎడిషన్