జ్వరం - గొంతు నొప్పితో బాధపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి!

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (11:15 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఇంటి వద్దే ఫ్యామిలీ వైద్యుడు పరీక్షించి తగిన మందులను సూచించారు. ఆ మందులను సీఎం రేవంత్ రెడ్డి వాడుతూ, రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. 
 
ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఇందుకోసం ఆయన నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ముందుగానే సమావేశమందిరానికి చేరుకున్నారు. నిజానికి ఆ సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిర్వహించాలనుకున్నారు. కానీ అది మూడు గంటల వరకు సాగింది. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ.. కార్యక్రమాన్ని కొనసాగించారు. 
 
అలాగే, గత గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన 'ఎట్‌ హోం' కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు. శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని ఏర్పాటు చేసిన గిగ్‌ వర్కర్ల సమావేశానికి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నతాధికారులతో పలు సమీక్షలు నిర్వహించి క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన అస్వస్థతను కూడా ఆయన లెక్క చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments