Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు దీపావళి పండుగగా ఇందిరమ్మను ఇవ్వబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, వైఎస్ఆర్ జీవించివున్నపుడు ఇందిరమ్మ గృహాలను నిర్మించారని, ఇపుడు కూడా అలాగే ఇస్తామని తెలిపారు. 
 
అలాగే, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సీసీఐ అభినందనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
 
రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టంచేశారు. వేబ్రిడ్జి కాటాలోతేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. 
 
ఈ యేడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోతున్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్ష నేతలు నష్టం వెచ్చించినట్టు ధ్వజమెత్తారు. అర్హులైన రైతులందరికీ తలతాకట్టు పెట్టైనా మిగతా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments