హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభించాయి. నగరంలో శీతాకాలం అనుభూతిని తలపిస్తోంది. శీతాకాలపు నాటి రాత్రులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ మార్కు కంటే దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో 17 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
సోమవారం రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 17.8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ పరిశీలనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు అల్వాల్, కుత్బుల్లాపూర్, చందానగర్, సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు దాదాపు 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
అయితే, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, చార్మినార్, మలక్‌పేట్ వంటి ప్రాంతాల్లో 21 డిగ్రీల సెల్సియస్ మరియు 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో కొద్దిగా వేడిగా ఉంది. రాజేంద్రనగర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలలో 16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా, నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి.