Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

Advertiesment
carrot
శీతాకాలం వచ్చేస్తోంది. చలిగాలులు ప్రారంభమయ్యాయి. కాలాలకు తగ్గట్లుగా మనం ఆహారాన్ని కూడా మార్చుకుంటుండాలి. శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
క్యారెట్- వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. 
బంగాళాదుంపలు- వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇవి యాంటీఆక్సిడెంట్.
ఉల్లిపాయలు- ఇవి యాంటీఆక్సిడెంట్లు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి.
ముల్లంగి- ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, పైల్స్, కామెర్లు, మధుమేహం మొదలైనవాటిని నయం చేస్తుంది.
చిలగడదుంపలు- జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్- వ్యతిరేక పోరాట లక్షణాలను కలిగి వుంటాయి.
పాలకూర- రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుంది.
మెంతికూర- మెంతి కూర తింటే శరీరానికవసరమైన పోషకాలు అందడమే కాకుండా లివర్ సమస్యలను తొలగిస్తుంది. 
పుదీనా- ఇందులో మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?