తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు.
తీవ్రమైన చలిగాలులకి కారణం... తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.