Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డి అను నేను: 2023లో ఉద్యమ నేతను ఓడించిన 'తెలంగాణ సింహం'

Revanth Reddy
, గురువారం, 21 డిశెంబరు 2023 (11:47 IST)
రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కలను నెరవేర్చిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఓడించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కేసీఆర్ వాక్చాతుర్యం ముందు ఎవరైనా తేలిపోతారు. విమర్శలకు దిగితే అవతలి వ్యక్తి ఔటైపోవాల్సిందే. అలాంటి ఉద్దండ నాయకుడిని ఎదుర్కొని, భారాసను ప్రతి పక్షంలోకి నెట్టేసారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బలమైన నాయకుడుగా పేరున్న కేసీఆర్ పగ్గాలను ఆయన చేతుల నుంచి లాగేసి కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పిన రేవంత్ రెడ్డిని ఆయన అభిమానులు, కార్యకర్తలు తెలంగాణ సింహం అని సంబోధిస్తున్నారు.
 
తెలంగాణ రెండో సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా, కొండారెడ్డి పల్లిలో 1969 నవంబర్ 8వ తేదీన రేవంత్ రెడ్డి జన్మించారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఆపై వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి స్వతంత్రంగా ఎన్నికయ్యారు. 
 
webdunia
2009లో టీడీపీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా, 2014లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-17 మధ్య తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఆయన 2017లో ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కి టీడీపీకి రాజీనామా చేశారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కాగా, 2018లో కాంగ్రెస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయినా పట్టుదలను వదిలిపెట్టని రేవంత్ రెడ్డి 2019 మే నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించారు. 
 
webdunia
2021లో జూన్ 26న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అనే నినాదాన్ని లేవనెత్తి.. ప్రజల్లోకి వెళ్లారు. ఆయన పట్టుదల, అవిరళ కృషికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల ఫలితాల ద్వారా పట్టం కట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మాకొట్టిన సీఎం కేజ్రీవాల్