Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (10:20 IST)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ తీసుకున్న నిర్ణయాలపై మంగళవారం హైకమాండ్ నేతలతో చర్చించనున్నారు. అలాగే పదిరోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. కీలక మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 24 లేదా 25న మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. 
 
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.
 
 ఆరుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడంపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. 
 
నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చిస్తారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రులు ఉన్నారు. మిగిలిన మంత్రి పదవులపై ఢిల్లీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. సో.. సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు. 
 
ఒక్కరోజులో చర్చలన్నీ ముగియబోతున్నాయి.
 
 ఈసారి గెలిచిన నేతలకే కాకుండా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, నిజామాబాద్‌లో షబ్బీర్ అలీ వంటి వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మైజారిటీకి దగ్గరవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రబలుతున్న కరోనా కొత్త వేరియంట్... జేఎన్.1తో ముప్పు ఎంత?