వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి... ఫర్నీచర్‌కు నిప్పు (వీడియో)

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (14:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ వడ్డీ వ్యాపారిపై బాధితులు తిరగబడ్డారు. రూ.10 కోట్లు ఎగ్గొట్టినందుకు ఈ వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి తెగబడ్డారు. ఇంటిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాకు చెందిన బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి.. స్థానికులకు అధిక వడ్డీ ఆశచూపి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఇలా రూ.10 కోట్ల మేరకు వసూలు చేశారు. ఆ తర్వాత తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన బాధితులు వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 
 
రూ.10 కోట్ల మేరకు వసూలు చేసిన ఆయన.. ఐపీ పెట్టి కోర్టుకు పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు పెద్ద ఎత్తున మంగళవారం వడ్డీవ్యాపారి ఇంటికి తరలివచ్చి ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments