Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వెనక్కి తగ్గిన కవిత... పిటిషన్ వెనక్కి!

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (15:32 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత ఇదే కేసులో గత యేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. పైగా, ఈ కేసులో బెయిల్‌తో పాటు తదుపరి చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాగా, ఈ కేసు విషయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు గత యేడాది సమన్లు జారీ చేయగా, వీటిని కవిత సవాల్ చేస్తూ గత యేడాది మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయరాదని, ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించాలంటూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పైగా, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆమె సుప్రీంను కోరగా కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి ఈడీ, కవిత పిటిషన్లపై విచారణలు, వాయిదాల పరంపర కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అదేసమయంలో ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసులో కవితను ఇప్పటికే అరెస్టు చేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని భావించిన ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ బెంచ్‌ అనుమంతిచారని చెప్పారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments