Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చాలా గలీజ్... నేను ఇపుడే వస్తా : సీఐ శ్రీనివాస్ - లావణ్య ఫోను ముచ్చట్లు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (11:44 IST)
సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ సర్కిల్ ఇన్‌స్పెక్టరుగా పని చేస్తున్న శ్రీనివాస్‌పై వేటుపడింది. ఆయనపై పలు రకాలైన ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణ నిమిత్తం లావణ్య ఇంటికి వెళ్లిన సీఐ శ్రీనివాస్.. ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదారి పట్టించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. 
 
ఈ కేసులో మస్తాన్ సాయి అరెస్టు తర్వాత అనేక ఆడియో టైపులు, వీడియోలు లీకైన విషయం తెల్సిందే. ఇవి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండటంతో సోషల్ మీడియాలో సంచలంగా మారుతోంది. మస్తాన్ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో నగ్నవీడియోలు, ఫోటోలతో పాటు ఆడియో క్లిప్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు సీఐ శ్రీనివాస్‌తో లావణ్య చేసిన ఫోన్ సంభాషణల వీడియో క్లిప్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఆడియో సంభాషణలో.. "రావడం లేదని చెప్పాలా.. నీకు వస్తా అంటే ఏమైతది. ఇపుడు నీకు వస్తా అంటే ఏం చేస్తరు. అవన్నీ మీకు ఎందుకు.. నాకు కావాలి" అని లావణ్య అంటే రావద్దు.. అర్థం చేసుకోండి అని సీఐ బదులిచ్చారు. 
 
దానికి ఆమె స్పందిస్తూ, అర్థం చేసుకోను.. గలీజ్.. నేను చాలా గలీజ్.. నేను ఇపుడే వస్తా.. మీరు డ్యూటీలో ఉన్నారు. పనిలో ఉండి కలవలేక అవ్వలేదు అంటే పర్వాలేదు.. నో ప్రాబ్లమ్.. సరే అపుడు దూరం నుంచి మిమ్మల్ని చూసి వెళ్లిపోతాను. నీ బతుకు నువ్వు చూసుకో.. నీది నువ్వు చూసుకో.. సంబంధం లేనట్టుగా ఉండు.. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. అని అడిగింది. దానికి ఆ పోలీస్ అధికారి.. నీ గురించి ఇస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్స్‌క్లూజివ్ ఇస్తాను అని బదులిచ్చారు. దానికి ఆమె ఎలాగైతే కాప్స్‌‍తో ఉన్నానో.. మీతో అలాగే ఉంటాను.. మనసులోనే ఉంచుకుంటానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments