Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

సెల్వి
సోమవారం, 21 జులై 2025 (11:32 IST)
హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరాయి. భాగ్యనగరం బోనమెత్తింది. అమ్మల కన్నా మాయమ్మ సల్లంగా సూడమ్మ అంటూ భక్తులు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వర్షాలు కురవాలని పిల్లాపాపలు, పాడి, పంటలు బాగుండాలని వేడుకుంటున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల బోనాలు, శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 
బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. 
Bonalu
 
లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ కమిటీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇందులో బోనాలు సమర్పించే వారి కోసం ఒక ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంది. ఆదివారం తెల్లవారుజామున కుమ్మరిబోనం సమర్పించడంతో ప్రారంభమైన బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments