Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Advertiesment
Bonalu

సెల్వి

, శనివారం, 19 జులై 2025 (15:10 IST)
Bonalu
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు రంగం సిద్ధమైంది. దీంతో జూలై 20 ఆదివారం, జూలై 21 సోమవారం రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. బోనాల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
అలాగే ఈ రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూలై 20న ఉదయం 6 గంటల నుంచి జూలై 22 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు మూతపడనున్నాయి. ఈ వైన్స్ బంద్ కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే. 
 
తెలంగాణలో బోనాలు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో, భక్తుల భద్రత, జాతర వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Made in India.. గ్యాలెక్సీ జెడ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్: రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు