Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఐవీఆర్
శుక్రవారం, 17 మే 2024 (18:27 IST)
రాములమ్మగా పిలుపించుకునే విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... భవిష్యత్తులో కేసీఆర్ స్థాపించిన భారాస కనుమరుగవుతుందని అన్నారు. దీనిపై విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా పేర్కొన్నారు.
 
''తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ.. ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి... దక్షిణాది.... దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దంక ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం.
 
ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం. హర హర మహాదేవ్. జై తెలంగాణ'' అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఐతే ఏపీలో వైసిపిని ఎండగడుతున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వున్నది. మరి ఆ సంగతి తెలిసి కూడా విజయశాంతి వైసిపిని వెనకేసుకు వస్తున్నారా? లేదంటే ఆమె భారాస పార్టీలోకి తిరిగి వెళ్లిపోతారా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments