Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

Advertiesment
raghurama krishnam raju

ఠాగూర్

, శుక్రవారం, 17 మే 2024 (13:48 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మహా అయితే, 25 సీట్లకు మించి రావని ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందంటూ ప్రచారం సాగుతుంది. మరోవైపు, అధికార పార్టీ మాత్రం తమకు అనుకూల ఓటింగ్‌గా ప్రచారం చేసుకుంటుంది. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలతో జగన్ ఆశలు గల్లంతవుతాయని చెప్పారు. వైకాపాకు కనీసం 25 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 
 
ఇదిలావుంటే, గురువారం ఐప్యాక్ ప్రతినిధులను సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికలకు మించిన ఫలితాలు రానున్నాయి. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకున్నాం. ఈ దఫా అంతకన్నా ఎక్కువ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్న సీట్లు వైకాపాకు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!