Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఠాగూర్
మంగళవారం, 12 ఆగస్టు 2025 (16:30 IST)
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు... సిద్ధిపేట జిల్లా రామారుకుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజావర్మ, శ్రీయా వర్మ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 
 
శ్రీనివాస్ వర్మ దంపతులు జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వసల వచ్చారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవరుగా పని చేస్తుంట, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె శ్రీజా వర్మ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లింది. ఈ మధ్యే ఎంఎస్ పూర్తి చేసింది. 
 
అయితే, భారతకాలమానం ప్రకారం సోమవారం రాత్రి అపార్టుమెంట్ నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ తన పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ ప్రాణాలు కోల్పోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments