Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (12:26 IST)
Husband_wife Fight
చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడటం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకుండా వాగ్వివాదాలకు దిగడంతో కొన్నిసార్లు వారి జీవితంలో విషాదం నెలకొంటుంది. తాజాగా తాను కొట్టడంతో భార్య చనిపోయిందనే భయంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివారం రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కుమారస్వామి, మౌనిక అనే జంట వివాహం చేసుకుని ఒక సంవత్సరం అయింది. వివాహం తర్వాత, వారు బండ్లగూడ జాగీర్‌లోని భవానీ కాలనీలో నివసిస్తున్నారు. ఇటీవల, బంగారు బ్రాస్లెట్ పోయిందని దంపతుల మధ్య గొడవ జరిగింది.
 
కూర్మరస్వామి కోపంగా మౌనికను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తన భార్య తన దాడి వల్లే చనిపోయిందని భావించి, ఆపై జరిగే పరిణామాలకు భయపడి కుమారస్వామి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పొరుగింటివారి సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో భార్య తర్వాత స్పృహలోకి వచ్చిందని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments