Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

ఐవీఆర్
శుక్రవారం, 31 జనవరి 2025 (22:14 IST)
రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎత్తితే ఆకాశానికి ఎత్తేస్తూ అపర కుబేరుడిని చేసేస్తుంది. కింద పడేస్తే ఇక లేవలేని పరిస్థితిని తీసుకువస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిన ఓ రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాదు లోని కుత్బుల్లాపూర్ పేట బషీరాబాద్ పోలీసు స్టేషను పరిధిలో వుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం గుండ్ల పోచంపల్లిలో ఈయన అపార్టుమెంట్ నిర్మించాడు. ఇందుకుగాను బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేక మరికాస్త ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా రుణం తీసుకున్నాడు.
 
ఐతే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా వుండటంతో అనుకున్న సమయానికి ఫ్లాట్స్ అమ్ముడవలేదు. దీనితో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. ఇక అప్పులవాళ్ల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments