Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (22:13 IST)
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కలిగి వున్నట్లు బాధితురాలు పట్టుబడటంతో.. 15మందితో కూడిన బృందం ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని సంజెలి తాలూకాలోని ఒక గ్రామంలో 35 ఏళ్ల మహిళ స్థానికుల చేతుల్లో దారుణంగా అవమానానికి గురైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
దాహోద్ జిల్లా గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఒక మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ 15 మంది వ్యక్తుల బృందం ఆమెపై దారుణంగా దాడి చేసింది. వారు ఆమె బట్టలు విప్పి, ఆమెపై దాడి చేసి, ఆపై ఆమెను మోటార్ సైకిల్ చక్రానికి కట్టి రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారు. 
 
ఆ మహిళ పట్ల జరిగిన దారుణమైన ప్రవర్తనను చిత్రీకరించే వీడియో వెలువడింది. జనవరి 28న బాధిత మహిళ గ్రామానికి చెందిన సదరు వ్యక్తి ఇంట్లో కనిపించినప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది.

ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకున్న వెంటనే, పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అనుమానితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments