Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

సెల్వి
మంగళవారం, 17 జూన్ 2025 (22:17 IST)
Swaroopa
ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీలోని కాప్రా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ స్వరూప.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్వరూప లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్, తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఏఈ స్వరూపను పలుమార్లు ఆశ్రయించారు. 
 
అయితే.. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి బదులుగా.. ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచంగా ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేసింది. అయితే ఆ కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేసాడు.

ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో.. బాధితుడైన కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ బృందం ఆమెను తక్షణమే పట్టుకుంది. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని.. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments