Publish Date: Mon, 16 Jun 2025 (21:40 IST)
Updated Date: Mon, 16 Jun 2025 (21:46 IST)
హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించాడు. ఒంటెలను నిర్వహించే వ్యక్తిగా గుర్తించబడిన ఆ వ్యక్తి ఒంటెపై హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోకి ప్రవేశించి ఫ్లైఓవర్ మీదుగా దూసుకుపోయాడు.
ఫ్లైఓవర్‌పై అధిక వేగంతో ఆ వ్యక్తి స్వారీ చేయడంతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు దీన్ని గమనించి షాకయ్యారు.
ఆపై ఇక ఒంటెను అలా వేగంగా రోడ్డుపై రైడ్ చేస్తున్న మందుబాబును కంట్రోల్ చేసిన వాహనదారులు పోరాడి చివరికి ఒంటెను లైట్ స్తంభానికి కట్టివేశారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా నిరోధించారు.
ఇంకా తమ ఫోనుల్లో ఈ ఘటనను రికార్డ్ చేశారు. ఈ వీడియోను నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.