Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (12:11 IST)
హైదరాబాద్ మధురానగర్ కాలనీలో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రూ.60 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధురానగర్‌లోని సత్యదేవి విల్లాస్‌లో ఉన్న ఆకుల హరిరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు నకిలీ కీలను ఉపయోగించి లాకర్లను తెరిచి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు. 
 
హరిరావు తన కుటుంబంతో కలిసి జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలానికి బయలుదేరాడు. జూన్ 24న తిరిగి వచ్చేసరికి ప్రధాన తలుపు తెరిచి ఉండి, ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించాడు. 
gold
 
 ఇంటి లోపల, బెడ్‌రూమ్‌లోని లాకర్‌ను తెరిచి వుండటం చూసి షాకయ్యాడు. ఇంకా లాకర్‌లోని, విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై  మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments