Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్, కేటీఆర్‌లకు హరీష్ రావు వెన్నుపోటు పొడిచేలా ఉన్నారు... మంత్రి కోమటిరెడ్డి

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:05 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సీనియర్ నేత హరీష్ రావు వెన్నుపోటుపొడిచేలా ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పైగా, త్వరలోనే కేటీఆర్, హరీష్ రావు, కవితల పేర్లతో భారాస చీలిపోతుందని, మరో 20 యేళ్లపాటు తెలంగాణాలో తమ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు. 
 
అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్, కవితలు వేరుపడి కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తారని, దీంతో ఆ పార్టీ నాలుగు ముక్కలయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలో హరీశ్ రావు ఉన్నారన్నారు. 
 
బీఆర్ఎస్‌లో ఉన్నంతకాలం హరీశ్ రావు కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేరన్నారు. 20 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ లీడర్ కావాలని ఆయనకు మంత్రి సూచించారు. 60 కిలోల బరువున్ కేసీఆర్ పులి అయితే, 86 కిలోల బరువున్న తాను ఏం కావాలని అన్నారు. తెలగాణాలో మరో 20 యేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments