Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

సెల్వి
బుధవారం, 13 ఆగస్టు 2025 (11:56 IST)
సోషల్ మీడియా పరిచయం బాలిక కొంపముంచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన హరికృష్ణ (21) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. 
 
అతనికి ఐదు నెలల క్రితం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక (16)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జూన్‌లో హరికృష్ణ బాలికను ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కు రమ్మని చెప్పాడు.
 
అక్కడకు చేరుకున్న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇంకా వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇటీవల బాలిక వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా, గర్భవతి అని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు హరికృష్ణను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం