ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

ఐవీఆర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (18:15 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
నీతి నిజాయితీ ఇంకా బ్రతికే వున్నాయని తెలిపేందుకు అక్కడక్కడా జరిగే కొన్ని ఘటనలు పట్టి చూపిస్తుంటాయి. తాజాగా రూ. 50 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్ల మూటను చూసి కూడా ఓ వ్యక్తి తన నిజాయితీ బంగారం కంటే ఎంతో విలువైనదని నిరూపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
సంగారెడ్డిలో రిటైర్ అయిన ఉద్యోగిని వసుధ ఆమె భర్త ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం సికింద్రాబాదులో 39 తులాల బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణించి తమ ఇంటికి చేరుకుని బంగారం బిస్కెట్లు పెట్టిన బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు. దాంతో వారు భయంతో ఆర్టీసి డిపోకి వెళ్లారు. ఐతే అప్పటికే వారు కొనుగోలు చేసిన బంగారం బిస్కెట్లు అక్కడకి వచ్చేసాయి. దీనికి కారణం ఓ నిజాయితీ కలిగిన వ్యక్తి.
 
వసుధ దంపతులు ప్రయాణించిన బస్సులోనే దుర్గయ్య అనే మరో వ్యక్తి ప్రయాణించాడు. అతడి కంటికి బస్సులో పడి వున్న బ్యాగు కనబడింది. తెరిచి చూస్తే అందులో బంగారం బిస్కెట్లు వున్నాయి. వాటిని ఆయన బస్సు కండక్టరుకి అప్పగించాడు. ఆయన వాటిని సంగారెడ్డి డిపో మేనేజరుకి అందించడంతో అలా తాము కష్టించి కొనుగోలు చేసిన బంగారం తిరిగి వారి ముందుకు వచ్చేసింది. తమ సొమ్మును నిజాయితీగా అప్పగించిన దుర్గయ్యకు వసుధ దంపతులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. దుర్గయ్యను డిపో మేనేజర్ ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments