కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (19:01 IST)
తన భార్య, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేటాయించిన శాఖ నుంచి పైసా ఆదాయం లేదని, ఆమెకు తానే నెలకు రూ.5 లక్షలు పంపుతానని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, "కొండా సురేఖ ఖర్చులకు నేనే నెలకు రూ.5 లక్షలు పంపుతాను. సురేఖకు మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఉన్నాక మన మంత్రి పదవికి ఎక్కడికి పోతుంది. కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు" అని అన్నారు. 
 
పనిలోపనిగా సొంత పార్టీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబును, ఈ రోజు కేసీఆర్, కేటీఆర్‌లను వెన్నుపోటు పొడిచిండు. రేవంత్ అన్న ఆయనతో జాగ్రత్తగా ఉండండి అని పరోక్షంగా మాజీ మంత్రి కడియం శ్రీహరిను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఇపుడు ఏదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్నాను.. బీసీ నాయకుడుని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పులో కొండా మురళి ఉన్నంత వరకు రెండో నాయకుడు ఎవరూ ఉండరని తేల్చి చెప్పారు. ఇక పరకాలలో 75 యేళ్ల ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు.. వచ్చేసారి మీకు వదిలేస్తారా అన్నారు. చివరకు సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేశారని అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments