Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చెల్లించలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య (Video)

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాన్స్‌‍ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు. 
 
అయితే, తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడిన మారుతి.. సోమవారం పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు. పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments