Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

సెల్వి
శనివారం, 18 మే 2024 (14:02 IST)
వివాహేతర సంబంధం భర్తను బలిగొంది. పక్కా ప్లాన్ ప్రకారం భార్య భర్తను హతమార్చింది. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్, రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి, మహ్మద్ మైతాబ్‌ను పోలీసులు అరస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డి గూడకు చెందిన విజయ్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మితో అతనికి వివాహం జరిగింది. వీరు ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రకాశ్ నగర్ అపార్ట్ మెంట్‌లో వుంటున్నారు. 
 
పెళ్లికి ముందే ప్రేమించిన రాజేశ్‌తో శ్రీలక్ష్మి సంబంధాన్ని కొనసాగింది. గంటల తరబడి ఫోనులో మాట్లాడేది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి.. భర్త ఆమె చేసిన తప్పును కనిపెట్టాడు. ఈ విషయంపై భార్యాభర్తలిద్దరికి గొడవ జరిగేది. దీంతో భర్తను మట్టుబెట్టాలని భావించింది. 
 
ప్రియుడి సాయంతో రౌడీషీటర్‌ రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దించింది. పక్కా ప్లాన్ ప్రకారం శ్రీలక్ష్మి ఇంట్లోనే ఆమె భర్తను చంపేశారు. అయితే విజయ్ కుమార్ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. 
 
అయితే రౌడీ షీటర్ పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో అసలు సంగతి బయటికి వచ్చేసింది. దీంతో శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లడంతో తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులు అమ్మమ్మ ఇంటికి చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments