కామద ఏకాదశి వ్రతం శుక్రవారం జరుపుకుంటారు. కామదా ఏకాదశి చైత్ర మాసం శుక్ల పక్షం 11వ రోజు వస్తుంది. ఏప్రిల్ 19వ తేదీన కామద ఏకాదశిని దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుపూజ, శ్రీలక్ష్మి పూజ అష్టైశ్వర్యాలను, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి.
అలాగే కామద ఏకాదశి వ్రత కథ చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది. ఏకాదశి నాడు కొన్ని పనులు చేయడం వల్ల విష్ణు అనుగ్రహం పొందుతారు.
ఈ రోజు విష్ణుపూజ గురుదోషాలను తొలగిస్తుంది. ఈ రోజున అరటి పండ్లను కలిపిన పంచామృతాన్ని విష్ణువుకు ప్రసాదించాలి. కామధ అంటే అన్ని కోరికలు తీర్చేవాడని అర్థం. లక్ష్మీసమేత విష్ణుమూర్తిని పూజించాలి. పూజలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని సమర్పించడం సర్వాభీష్ఠాలను నెరవేస్తుంది.