కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. చెత్త ఎత్తుతుండగా ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు కారణం రసాయన పదార్థాలని గుర్తించారు. 
 
అయితే, ఈ కెమికల్స్ అక్కడకు ఎలా వచ్చాయి. ఎవరు వేశారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments