Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (12:34 IST)
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త తమ మూడున్నరేళ్ల కుమారుడుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణెలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు. 
 
హిమ్మత్ మాధవ్ తికేటి, మాధవ్ తికేటి, ఆయన భార్య స్వరూపల చిన్నకుమారుడు. ఆ కుటుంబం విశాఖపట్టణం నుంచి వచ్చింది. ఈ క్రమంలో భార్యను మాధవ్ అనుమానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం, అనుమానంతో ఉన్న మాధవ్‌ తన చిన్న కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు మధ్యాహ్నం 12.30 గంటలకు బార్‌కి వెళ్లాడు. అక్కడ నుంచి సూపర్ మార్కెట్‌కి, ఆ తర్వాత చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. 
 
సమయం గడిచిన కొద్ది ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో స్వరూప, తన భర్త, కొడుకు కనిపించడం లేదని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాధవ్ చివరిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన కొడుకుతో కనిపించాడు. కానీ, ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ఫుటోజీలో అతడు ఒంటరిగా బట్టలు కొనుగోలు చేస్తున్నట్టు కనిపించాడు. 
 
ఆ తర్వాత మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడిని ఓ లాడ్జిలో పట్టుకున్నారు. తాగి మత్తులో ఉన్న మాధవ్ స్పృహలోకి వచ్చిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు. సంఘటనా స్థలంలో బాలుడు మృతదేహాన్ని గుర్తించారు. గొంతు కోసం హత్య చేసినట్టు తెలిసింది. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments