ఉద్యోగం అక్కర్లేదు.. డబ్బు, - భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను.. మాజీ డీఎస్పీ నళిని

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (10:18 IST)
తనకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదని, ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. అందువల్ల ఇపుడు తనకు డబ్బు వద్దని, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డానని తెలిపారు.  
 
ప్రత్యేక తెలంగాణ కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని.. ఆ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆమెను గత ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో శనివారం సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు చెప్పారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో వేదం, యజ్ఞం పుస్తకాలను పూర్తి చేస్తున్నానని... ఆ తర్వాత సనాతన ధర్మ ప్రచారం చేస్తానని వెల్లడించారు.
 
తాను ఉద్యోగం చేసిన సమయంలో తాను... తన సహోద్యోగులు డిపార్టుమెంట్లలో ఎదుర్కొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని, అలాంటి ఇబ్బందులు మరొకరికి జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలోనే తనకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నట్లు తెలిపారు. తన విషయంలో జరిగిన అన్ని పరిణామాలను
 
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇన్నాళ్ల తన మనోవ్యధను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. ఇప్పుడు తన మనసుకు నచ్చిన ఆధ్యాత్మిక సేవను చేస్తున్నానని, అందువల్ల తనకు ఇపుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments