డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే.. హెడ్ కానిస్టేబుల్ అలా చేశాడు.. (video)

సెల్వి
బుధవారం, 9 అక్టోబరు 2024 (14:05 IST)
ఓ మహిళ డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే.. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యాచార ప్రయత్నం చేశాడు. మెల్లగా మాటలు కలిపి ఆమెతో పరిచయం పెంచుకుని ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్‌ వనస్థలిపురం ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు సాహెబ్‌నగర్‌ గాయత్రీనగర్‌ ప్రాంతం నుంచి ఇటీవల డయల్‌ 100కు ఓ మహిళ కాల్‌ చేసింది. ఈ మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు. 
 
ఈ పరిచయం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వరకూ దారితీసింది. ఈ క్రమంలో మహిళ కానిస్టేబుల్‌కు డబ్బు ఇచ్చింది. అయితే కానిస్టేబుల్‌ ఆ డబ్బు ఇవ్వడంలో ఇవ్వకపోవడంతో బాధితురాలు అతడిని నిలదీసింది. 
 
దీంతో అక్టోబర్‌ 4వ తేదీన ఇంజాపూర్‌లో కమాన్‌ వద్ద తమ తల్లిదండ్రులు ఉన్నారని, వాళ్లిచ్చే డబ్బు ఆమెకు ఇస్తానని నమ్మబలికి ఆమెను కారులో ఇంజాపూర్‌ వైపు తీసుకెళ్లి.. ఓ నిర్జన ప్రదేశంలోకి కారును తీసికెళ్లి, అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. 
 
అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో సదరు కీచక కానిస్టేబుల్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments