చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

ఐవీఆర్
మంగళవారం, 4 నవంబరు 2025 (23:06 IST)
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు సోదరీమణులు ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది. కన్నీటిపర్యంతమైంది. తీవ్ర దుఃఖంతో నిండిన హృదయాలతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను అంత్యక్రియలకు సాగనంపారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. సోదరీమణులు ఇటీవల ఒక వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా విషాదం సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ అక్ర‌మంగా నిషేధిత సమయంలో భారీ లోడ్‌తో సిటీలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లోనే హైదరాబాద్ పోలీసులు రెండుసార్లు ఈ టిప్పర్ లారీకి జరిమానా విధించారు. చందాన‌గ‌ర్ ప‌రిధిలో ఓసారి, ఆర్.సీ పురం ప‌రిధిలో మ‌రోసారి ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ లారీ ఎంట్రీ ఇచ్చింది. అనిత అనే పేరుతో టిప్ప‌ర్ రిజిస్ట్రేష‌న్ అయ్యింది. ప్రమాద స‌మ‌యంలో మోతాదుకు మించిన కంక‌ర లోడ్‌తో పాటు ఓవ‌ర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments