చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది కంకరలో ఇరుక్కున ఊపిరాడక చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు నడుము లోతు కంకరలో ఇరుక్కున నరకయాతన అనుభవించారు. చేవెళ్ల-వికారాబాద్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	రోడ్డు ప్రమాదానికి గురైన బస్సును అక్కడే వుంచాలనీ, ఆ దృశ్యాలను చూసైనా అధికారులకు, ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు బాధితులను పరామర్శించేందుకు ఘటనా స్థలానికి వచ్చిన నాయకులను పలువురు అడ్డుకున్నారు. రోడ్డును విస్తరించమంటే పట్టని మీరు ఇపుడు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ వస్తున్న ఆర్టీసి బస్సును రాంగ్ రూట్లో అతి వేగంగా వచ్చిన కంకర లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.