ఎలాంటి తప్పు చేయనప్పుడు కవితకు భయమెందుకు? కిషన్ రెడ్డి

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (20:09 IST)
Kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? అని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లూ ఈడీ విచారణకు సహకరించకుండా ఆమె తప్పించుకున్నారని ఆరోపించారు. ఆమె సహకరించనందునే ఈడీ నేరుగా ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో దాదాపు ఐదు గంటల సేపు సోదాలు జరిపి, విచారణ జరిపిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
కవిత నివాసం నుంచి నాలుగు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. రాత్రి 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఢిల్లీకి తరలించేందుకు సాయంత్రమే ఫ్లైట్ టికెట్లను బుక్ చేశారు. ఈ రాత్రికి కవిత ఈడీ అదుపులోనే ఉంటారు. మనీలాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments