పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేసే అవకాశం వుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తులో ట్విస్ట్ తప్పలేదు. పొత్తుకు సంబంధించి ఢిల్లీలో భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌కు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
మరి కొద్ది రోజుల్లో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తుపై క్లారిటీ రానుంది. సీటు షేరింగ్ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీలోని పెద్దలతో భేటీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రపోజల్‌పై పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవగలిగితే ఆయనను కేంద్ర మంత్రివర్గంలో చూడవచ్చు.
దక్షిణాదిని విస్మరించి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. అందుకే కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరాదికి చెందిన నాయకులు కనిపిస్తారు.
ప్రస్తుత కేబినెట్‌లో కిషన్‌రెడ్డి వంటి కొద్దిమంది తెలుగు ఎంపీలకు మాత్రమే చోటు దక్కింది. అంతా సవ్యంగా జరిగితే పవన్ కూడా కేబినెట్‌లో చేరవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు.