Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశాబాబు!!

వరుణ్
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (16:50 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిర్పూర్ బీజేపీ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు కలుసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎంతో హరీశ్ బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగినట్టు బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. అయితే, ఈ భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో తీర్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఇదే విషయంపై హరీశ్ బాబును సంప్రదించగా, కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమే సీఎంని కలిసినట్లు తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు, ఇతర సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశానన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అయితే మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు హరీశా బాబు గైర్హాజరవడం గమనార్హం. 
 
ఇతర పార్టీ నేతలే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మల్ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకరులతో పేర్కొన్నారు. అభివృద్ధి పనులు, ప్రజాసంక్షేమం విషయంలోనే హరీశ్ బాబు ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు. 
 
పెయిన్ కిల్లర్‌గా పారాసిటమాల్ వాడుతున్నారా? కాలేయం పాడైపోవచ్చు...!!
 
చాలా మంది చిన్నపాటి జ్వరానికి లేదా చిన్నచిన్న శరీర నొప్పుల కోసం పారాసిటమాల్ మాత్రలను వినియోగిస్తుంటారు. ఈ తరహా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఈ మాత్రం అద్భుతంగా పని చేస్తుంది కూడా. అయితే, అదేపనిగా ఈ మాత్రను వాడటంపై వైద్య పరిశోధకులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఈ మాత్రలను పొద్దస్తమానం వినియోగిస్తే అనారోగ్య సమస్యలతో పాటు శరీర అవయవాలు దెబ్బతింటాయని వారు పేర్కొంటున్నారు. 
 
ఇదే అంశంపై ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే విషయం ఒకటి వెల్లడైంది. ఎలుకలకు అదే పనిగా పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్ అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు రోజుకు 4 గ్రామల వరకు పారాసిటమాల్ తీసుకోవడం వరకు ఓకే అని, కానీ అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పణంగాపెట్టడమే అవుతుందని తెలిపారు.
 
పారాసిటమాల్ మందు అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు. పారాసిటమాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదే. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments