Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపుల యజమానులు తెరుచుకోవద్దని ఈసీ సూచించింది. 
 
ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాపు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అదేవిధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్‌ను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments