తెలంగాణాలో ఎన్నికలు.. ఏపీలో ఎఫెక్ట్ ఎంత?

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (12:30 IST)
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై కూడా వుండనుంది.  ఏపీలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని స్థానభ్రంశం చేసి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. 2024 సంవత్సరం కోసం ఎదురుచూపులు స్పష్టంగా ఉన్నాయి.
 
ఇరుపక్షాలు తమ ప్రయత్నాలలో ఏవిధంగా రాజీ పడట్లేదు.  తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో రాజకీయ డైనమిక్స్‌పై పెను ప్రభావం చూపగలవని సెంటిమెంట్ వుంది. తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వం సరిహద్దు జిల్లాలు, రాజధాని హైదరాబాద్‌లోని ఓటరు ప్రాధాన్యతలను ముఖ్యంగా సెటిలర్లు, వారి బంధువులలో తారుమారు చేయగలదని భావిస్తున్నారు.
 
తెలంగాణలో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఏపీలో వైఎస్సార్‌సీపీ స్థానానికి బలం చేకూరుతుందని అంచనా. దీనికి విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. 
 
సరిహద్దు జిల్లాల్లో ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణలో మద్దతు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేది ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల అంతర్లీన వ్యూహంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments