Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు : ఆలస్యం కానున్న ఫలితాల వెల్లడి.. ఎందుకు?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఇందుకుసంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వెల్లడిలో కాస్త ఆలస్యంకానున్నాయి. 
 
సాధారణంగా ఎన్నికల సంఘం కొత్త నిబంధన మేరకు తొలి ఫస్ట్ రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. అయితే, ఎన్నికల సంఘం తీసుకున్న కొత్త నిబంధన మేరకు తొలి రౌండ్ ఫలితం వెల్లడిలో మరింత జాప్యంకానుంది. 
 
ఈ నిబంధన ఏంటో పరిశీలిస్తే, సాధారణంగా ప్రతి ఔండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ వివరాలను స్టేట్మెంట్ రూపంలో నమోదు చేయాలి. ఆ కాపీని ఆయా పార్టీలకు చెందిన రిప్రజెంటేటివ్‌లకు అందజేస్తారు. వారు అంగీకరిచిన తర్వాత ఈ స్టేట్మెమెంట్‌పై రిటర్నింగ్ అధికారి సంతకం చేయాల్సి వుంది. ఆ తర్వాతే మీడియాకు అందజేస్తారు. 
 
అందులో ఓ కాపీని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. గతంలో అయితే ప్రతి రౌండ్ ఫలితాన్ని చూపించేవారు. ఇప్పుడు మాత్రం ప్రతి రౌండ్ ఫలితాన్ని స్టేట్మెంట్‌గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యం కావొచ్చని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైనల్ రిజల్ట్స్ తెలిసేవి. కానీ, ఇప్పుడు మరో 2 గంటలు ఆలస్యం కావొచ్చని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments