Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : నోట్ల కట్టలే కట్టలు... ఏరులై పారుతున్న మద్యం

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (09:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం జరిగిన ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అదేసమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు దిగారు. ఇందులోభాగంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా పంచుతున్నారు. 
 
ఎన్నికల్లో ధన ప్రవాన్ని అడ్డుకునేందుకు గట్టి నిఘా పెట్టారు. అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈనెల 5వ తేదీవరకు ఏకంగా రూ.137 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు. 
 
తాజాగా ప్రజాకూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందినదిగా భావిస్తున్న రూ.3.30 కోట్ల నగదును నిఘా అధికారులు పట్టుకున్నారు. అలాగే, హైదరాబాద్‌లో 8 మంది హవాలా ఆపరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంమీద తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచి ధన, మద్యం ప్రవాహాలు ఏరులై పారుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments