ఈ కేక్ చేయడం చాలా సింపుల్... మీ పిల్లలకు చేసి పెట్టండి..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:42 IST)
సాధారణంగా కేక్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వీటికోసం బేకరీల చుట్టూ తిరిగి పిల్లలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కనుక మనం మన ఇంట్లోనే పిల్లలకు ఇష్టమైన కేక్స్‌ను తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా తయారుచేసి పెట్టవచ్చు. ముఖ్యంగా రవ్వతో చేసిన కేక్స్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు రవ్వను ఉపయోగించి కేక్స్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బొంబాయి రవ్వ- 2 కప్పులు
తినే సోడా-అర టీ స్పూన్
పచ్చికొబ్బరి తురుము-ఒక కప్పు
నెయ్యి-పావుకప్పు
పెరుగు- ఒక కప్పు
బాదం- పావు కప్పు
చక్కెర- 2 కప్పులు
పాలు- పావు కప్పు
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్
 
తయారీ విధానం..
ఒక బాణలిలో బొంబాయి రవ్వ, తినే సోడా, కొబ్బరితురుము, పాలు, పెరుగు, నెయ్యి, ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక వెడల్పాటి పాత్రలో సమానంగా పోసి కుక్కర్లో అరగంటపాటు ఉడికించాలి. ఒక గ్లాసు నీళ్లు, నిమ్మరసం వేసి మిగిలిన చక్కెరను పాకం పెట్టాలి.
 
రవ్వకేక్ వేడిగా ఉండగానే పైన చక్కెర పాకం పోసి రెండు నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని పైన బాదంతో అలంకరించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?

KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దు.. ఇష్టమైన దుస్తులు ధరించండి : నిర్మాత ఎస్కేఎన్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments