Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం స్నాక్స్... గుమ్మడికాయ బ్రెడ్, టేస్ట్ చేస్తే వదల్లేరు...

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:55 IST)
గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పిల్లలు వెరైటీ స్నాక్స్ కావాలని గొడవ పెడుతుంటారు. పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలను మనం చేసిపెట్టడం వలన వారి ఆరోగ్యాన్ని కాపాడినవారమవుతాము. మరి గుమ్మడికాయతో బ్రెడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
 
మైదాపిండి- రెండున్నర కప్పులు, 
బేకింగ్ పౌడర్- ఒక టీస్పూను
దాల్చినచెక్కపొడి- అర టీస్పూను, 
అల్లం పేస్టు- పావు టీస్పూను 
జాజికాయ పొడి- అర టీస్పూను,
గుమ్మడి కాయ గుజ్జు- ఒక కప్పు,
అరటిపండు గుజ్జు- ఒక కప్పు,
పంచదార- అరకప్పు,
తేనె-  అరకప్పు,
ఆవనూనె- పావుకప్పు, 
గుడ్లు- రెండు,
వాల్ నట్- ముప్పావుకప్పు,
ఉప్పు- తగినంత.
 
తయారుచేసేవిధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి ఒకదాని తరువాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు, అరటిపండిు గుజ్జు, గుమ్మడి కాయ గుద్దు, పంచదార, తేనె, ఆవనూనె, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మేకర్ బౌల్‌లో ఆ మిశ్రమం మొత్తాన్ని వేసుకుని దానిపై వాల్‌నట్ తురుముని వేసుకుని నలబై నిముషాల పాటు ఉడకనివ్వాలి. చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ బ్రెడ్ రెడీ. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments