రాఖీ స్పెషల్ : రైస్ ఖీర్ ఎలా చేయాలో తెలుసా?

శ్రావణ మాసంలో పండుగలు వరుసపెట్టి వస్తుంటాయి. అలాంటి పండుగల్లో ఒకటి రాఖీ పూర్ణిమ. ఉత్తరాది పండగైనప్పటికీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకోబడుతున్న ఈ పండుగలో రాఖీ దారాలకు తోడు స్వీట్లు తప్పకు

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (15:44 IST)
శ్రావణ మాసంలో పండుగలు వరుసపెట్టి వస్తుంటాయి. అలాంటి పండుగల్లో ఒకటి రాఖీ పూర్ణిమ. ఉత్తరాది పండగైనప్పటికీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకోబడుతున్న ఈ పండుగలో రాఖీ దారాలకు తోడు స్వీట్లు తప్పకుండా ఉండాల్సిందే. ఉత్తరాదిన రాఖీ పండుగ రోజున బాదంతో చేసిన స్పెషల్ స్వీట్లను అన్నయ్య రాఖీ కట్టేటప్పుడు తినిపించడంతో పాటు ఇరుగుపొరుగు వారికి ఇస్తుంటారు. అలాంటి స్వీట్లలో ఒకటి రైస్ ఖీర్. 
 
రైస్ ఖీర్ ఎలా చేయాలంటే.. 
కావలసిన పదార్థాలు
బాస్మతి రైస్ - ఒక కప్పు 
పాలు - ఆరు కప్పులు
యాలకుల పొడి - ఒక టీ స్పూన్ 
బాదం పప్పు - పావు కప్పు 
కుంకుమ పువ్వు - కొద్దిగా 
పిస్తా పొడి - పావు కప్పు, 
పంచదార - తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు తీసుకోవాలి. అందులో కుంకుమ వేసి నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. మరో పెద్ద గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు మరిగిన తర్వాత బియ్యం వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు బాదం, పిస్తా, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద మరో ఐదు నిమిషాలు ఉంచాలి. చివరగా చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత దించేయాలి. ఇప్పుడు ఈ ఖీర్‌ని ప్లేట్‌లోకి తీసుకొని కొన్ని పిస్తా, బాదం పొడిని చేర్చి మరి కొన్ని బాదం, పిస్తా పప్పుల ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రైస్ ఖీర్ రెడీ అయినట్లే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం... 65 యేళ్ల వృద్ధుడికి మరణశిక్ష

జూన్ 30, జూలై 1 తేదీలలో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

తర్వాతి కథనం
Show comments